మహిళా శక్తి భవన నిర్మాణానికి కేటాయించే భూమిని పరిశీలించిన కలెక్టర్ 

The Collector examined the land to be allocated for Mahila Shakti Bhavanనవతెలంగాణ –  కామారెడ్డి
మహిళా శక్తి భవన నిర్మాణానికి కేటాయించే భూమిని గురువారం జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్  పరిశీలించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మహిళా శక్తి భవన నిర్మాణానికి పట్టణ సమీపంలోని జాతీయ రహదారి నెంబర్ 44 ప్రక్కన గల సర్వే నెంబర్ 527 లో ఒక ఎకరం భూమి కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. మహిళాశక్తి భవన నిర్మాణానికి ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథ్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, పంచాయతీ రాజ్ ఈఈ దుర్గా ప్రసాద్, డిపిఎం రమేష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.