
పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి నల్గొండ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో నిర్వహిస్తున్న ఈవీఎంల కమిషనింగ్ లో భాగంగా ఆదివారం నల్గొండ పట్టణంలోని నాగార్జున కళాశాల ఆవరణలోని నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ వద్ద ఉన్న స్ట్రాంగ్ రూంలో జరుగుతున్న ఈవీఎం కమిషనింగ్ ని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పరిశీలించారు. కమిషనింగ్ చేస్తున్న సందర్భంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయా అనే విషయాలను సెక్టోరల్ ఆఫీసర్స్ ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, నల్గొండ ఆర్డివో రవి ఉన్నారు.