
మండలంలోని అభంగపట్నం గ్రామంలో ఐకెపి సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించి తూకం వేసిన ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు చేరేలా కృషిచేసి వెనువెంటనే ట్యాబ్ ఎంట్రీ చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ సాయి గౌడ్, డి సి ఓ శ్రీనివాస్ రావు, డిపిఎం సాయిలు, తహసిల్దార్ వెంకటరమణ, ఎంపీడీవో నాగనాథ్, ఏవో నవీన్ కుమార్ మరియు రైతులు పాల్గొన్నారు.