గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ పర్యటించారు. గాంధారి మండలంలోని సీతాయిపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కొనుగోలు సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. దాంతోపాటుగా ముదేల్లి గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని మరియు ప్రాథమీకోన్నత పాఠశాలను సందర్శించి పలు రికార్డులు పరిశీలించి పిల్లలకు అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డిఓ ప్రభాకర్, తాసిల్దార్ సతీష్ రెడ్డి , ఎంపీడీవో రాజేశ్వర్, ఏం సి చైర్మన్ పరమేష్, ముద్దెల్లి పిఎసిఎస్ చైర్మన్ సజ్జనపల్లి సాయిరాం వివిధ శాఖల అధికారులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.