
పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సహాకారం ఎంతైనా అవసరం ఉంటుంది అని అదనపు కలెక్టర్, ఎన్నికల అధికారి పి.రాంబాబు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ఆదేశానుసారం వారం వారం నిర్వహించే రాజకీయ పార్టీల నాయకులు సమావేశం బుధవారం తహశీల్ధార్ ర్యాలయంలో ఆయన నిర్వహించారు. ఎవరు నకిలీ, ఎవరు అసలు ఓటర్ అనే విషయం క్షేత్రస్థాయిలో బి.ఎల్.ఒ లు కంటే రాజకీయ నాయకులే అధికంగా తెలిసే అవకాశం ఉందని అన్నారు. గుర్తింపు పొందిన అన్ని పార్టీలు ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొనాలని కోరారు. ఈయన వెంట తహసీల్దార్ క్రిష్ణ ప్రసాద్, డి.టి సుచిత్ర, ఎన్నికల డి.టి వీరభద్ర నాయక్ లు పాల్గన్నారు.