
– జిల్లాలో వర్షాల వల్ల ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూడాలి.
– భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి.
– చెరువులు నిండిన చోట, ఓవర్ ఫ్లో అయిన చోట మానిటరింగ్ ఆఫీసర్ లను వెంటనే పెట్టాలి.
– నీటి ప్రవాహం ఉన్న లో లెవెల్ వంతెన, రోడ్లలో హెచ్చరిక ఫ్లెక్సీ లతో పాటు మానిటరింగ్ ఆఫీసర్ ఉండాలి.
– ఓర్రెలు, వాగుల్లో నీటి ప్రవాహం ఉన్నందున వాటిని దాటి రైతులు పంట క్షేత్రాలకు వెళ్లకుండా చూడాలి.
– మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని సూచించారు.
– పాత ఇల్లులో నివసించేవారు అధిక వర్షాల కారణంగా కూలిపోయే ప్రమాదం ఉందని, వారిని గుర్తించి అధికారులు ప్రభుత్వ కార్యాలయాలు నివాసం ఏర్పాటు చేయాలని తెలిపారు.
– అధికారులు తమ హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాలి.
– అధికారులు తమ హెడ్ క్వార్టర్ లో అందుబాటులో ఉండాలి.
– గర్భిణీల సమాచారం తమ వద్ద ఉందని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్న వైద్యులకు సమాచారం అందించాలని కోరారు.
– పోచారం, కౌలస్ నాల, నిజాంసాగర్ దిగువ ప్రాంతంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
– ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు, ప్రజలు, ప్రయాణికులు వాగులు, ఒర్రెలను దాటోద్దు.
– పాఠశాలలు సెలవులున్న నేపథ్యంలో పిల్లలను బయటకు పంపవద్దని సూచించారు.
– భారీ వర్షాల కారణంగా విద్యుత్తు సమస్యలు ఏర్పడితే విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు.
– చెరువులు, లో లెవెల్ వంతెన లు, రోడ్ల వద్ద నిరంతర మానిటరింగ్ కు అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు.
జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచనలు
– ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, కాలువలు, ప్రాజెక్టుల, చెరువుల వద్దకు వెళ్లవద్దు.
– చెట్ల కింద, పాడైన భవనాల కింద, శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండరాదు.
– కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు ముట్టుకోరాదు.
– వర్షం వల్ల వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉంది. పరిమిత వేగంతో వాహనాలు నడుపాలి. నీటి ప్రవాహాలు వెళ్లే లో లెవెల్ వంతెనలు, రోడ్ల పై ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణం చేయవద్దు.
– అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి.
– చెరువులు, రోడ్లు తెగి ప్రమాద స్థితికి చేరుకున్న, అత్యవసర సేవలకు కలెక్టరేట్లోని కంట్రోల్ రూం నెంబరు 08468 – 220069ను సంప్రదించాలి.