ఎన్నికల విధులలో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి: కలెక్టర్‌

ఎన్నికల విధులలో అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలి: కలెక్టర్‌నవతెలంగాణ-మహబూబాబాద్‌
ఎన్నికల విధులలో అధికారులు విస్తతంగా పర్యటించాలని, ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. గురువారం ఐడిఓసిలోని కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో ఎన్నికల పరిధులు అధిగమించి చేపడుతున్న ప్రచారంపై నిఘా పెట్టేందుకు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ క్రింద ఏర్పాటు చేసిన స్టాటిస్టికల్‌ సర్వేలన్స్‌ టీమ్స్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్స్‌, సి.విజిల్‌ యాప్‌ పనితీరు, ప్రచార సామాగ్రి పంపిణీ, వాహనాల చెకింగ్‌, మద్యం, గుడుంబా, గంజాయి అక్రమ తరలింపు, నగదు పంపిణీ వంటి పలు కార్యక లాపాలపై ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ ఇరా సింఘాల్‌, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ లతో కలిసి సంబ ంధించిన అధికారులు తో జిల్లా ఎన్నికల అధికారి సమీ క్షించారు. ఈసందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికలలో నిబంధనలను అతిక్ర మించిన వారిని ఉపేక్షించరాదన్నారు. వాట్సాఫ్‌ గ్రూప్‌లో పంపించాలన్నారు. కేసులు బుక్‌ చేయిం చాలన్నారు. ఎన్నికల అబ్జర్వర్‌ లు పర్యటిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, రోజు వారీ నివేదిక అందజేస్తూ అందుకు తగ్గ సాక్షాధారాల వీడియో, ఫోటోలను పంపించాలన్నారు. 24/7గా ఏర్పాటు చేసిన బృందాలు పనితీరు మెరుగు పరచు కోవాలన్నారు. సివిజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదులు అత్యధికంగా వచ్చే విధంగా ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. రైల్వే, బస్‌స్టేషన్‌లపై దృష్టి పెట్టాలని, తనిఖీ చేయకుండా ఏ ఒక్క వాహనం వెళ్లరాదన్నారు. ర్యాలీలు సమావేశాల్లో ఏర్పాటు చేసే సామాగ్రి అంతా వీడియో తీయించాలని, తీసిన ప్రతి వీడియో అధికారులకు అందజేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశం లో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌ అదనపు ఎస్పీ చెన్నయ్య, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అధికారిణి నర్మద, 101-డోర్నకల్‌, 102-మహబూ బాబాద్‌ నియోజకవర్గ ఆర్వోలు నర్సింహారావు, అలివేలు జిల్లా నోడల్‌ అధికారులు, ఎస్సెస్‌ టి,ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఓటరు గుర్తింపు కార్డు ఓటర్‌కే అందజేయాలి
ఓటరు గుర్తింపు కార్డులను సంబంధిత ఓటర్‌కే మాత్రమే అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలె క్టర్‌ శశాంక స్పష్టం చేశారు. గురువారం ఐడీఓసి లోని కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో(ఏపిక్‌) ఓటర్‌ ఫోటో గుర్తింపు కార్డుల పంపిణీ పై ఎన్ని కల విభాగం అధికారులు పోస్టల్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఆర్డర్‌ ఇచ్చిన కార్డుల ను ప్రింట్‌ అయ్యి వచ్చిన కార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకను 11,490 కార్డులు ఉన్నట్లు అధికా రులు వివరి ంచారు. ఈసందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో 54 వేల ఓటరు ఫోటో గుర్తింపు కార్డులను పంపిణీకై చర్యలు తీసుకున్నందున పోస్టల్‌ ద్వారా సంబంధిత ఓటర్‌కే అందేవిధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్డుల పంపిణీ తీరును తెలియజేస్తూ రోజు వారిగా ఎన్ని కార్డులు పంపిణీ అయ్యాయో నివేదిక అందిం చాల్సిందిగా అధికారులకు సూచించారు. ఈసమీక్ష సమావేశంలో ఎన్నికలసెక్షన్‌ తహసీల్దార్‌ పవన్‌ కుమార్‌ సిబ్బంది, రంజిత,్‌ పోస్టల్‌ శాఖ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.