ఈవిఎం కమిషనింగ్ ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేయాలి: కలెక్టర్

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  ఈవిఎమ్స్ కమిషనింగ్( బ్యాలెట్ పేపర్ అనుసంధానం)  ప్రక్రియ అప్రమత్తంగా పూర్తి చేయాలని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  ఎస్. వెంకట్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం  సూర్యాపేట ఏఎంసీ మార్కెట్ యార్డ్ లో సూర్యాపేట నియోజక వర్గానికి సంబంధించి ఈవిఎమ్స్ కమిషినింగ్, మాక్ పోల్ విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజక వర్గాల పరిధిలో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు   ఈవిఎమ్స్ కమిషినింగ్ ప్రక్రియ అలాగే మాక్ పోల్ అప్రమత్తంగా  చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ వేణుమాధవ్, తహశీల్దార్లు శ్యామ్ సుందర్ రెడ్డి, కృష్ణయ్య, మహేందర్ రెడ్డి , ఎస్ ఎల్ ఎం టి పి. వెంకటేశ్వర్లు ,ఎన్నికల సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు.