నవతెలంగాణ – నూతనకల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే లో ప్రతి ఒక్కరూ కుటుంబ వివరాలతో ఎన్యుమారెటర్ కు సహకరించాలని అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ రాంబాబు సూచించారు. శనివారం మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో మాట్లాడారు. అనంతరం నేడు ఎన్నికల ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నందున జడ్పీహెచ్ఎస్ స్కూల్లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించినారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని సూచించినారు. ఎం ఎ సి ఎస్ ధాన్యపు కొనుగోలు కేంద్రమును పరిశీలిం,చి ధాన్యము కొనుగోలు చేసిన వెంటనే మిల్లుకు తరలించిన వెంటనే రెండు రోజులలో ట్యాబ్ ఎంట్రీ చేయాలని ఆదేశించినారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయుటకు మండల సిబ్బందిని ఆదేశించినారు. వీరి వెంట తహసిల్దార్ శ్రీనివాసరావు ఎంపీడీవో సునీత మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ హస్సన్ మహమ్మద్ రెవిన్యూ సిబ్బంది కొనుగోలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.