నవతెలంగాణ – కామారెడ్డి
కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్ ఎంట్రీలు వెంటది వెంట నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) తో కలిసి ధాన్యం కొనుగోళ్లు, ట్యూబ్ ఎంట్రీలు, రైతులకు చెల్లింపు అంశాలపై కలెక్టర్ పౌరసరఫరాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యం ను పరిశీలించి కొనుగోళ్లు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యం కాంటా చేసి సంబంధిత రైస్ మిల్లలకు తరలించాలని, అదేవిధంగా ట్యాబ్ ఎంట్రీ చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతుల బ్యాంక్ ఖాతాలు, తదితర వివరాలను ట్యాబ్ ఎంట్రీలు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో ట్యాబ్ ఎంట్రీలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆన్లైన్ లో ట్యాబ్ ఎంట్రీలు చేసిన తరువాత రైతులకు చెల్లింపులు జరుగుతాయని వివరించారు. ట్యూబ్ ఎంట్రీ వివరాలు నమోదు చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్యాబ్ ఎంట్రీల పరిశీలనకు ఆయా మండల తహసీల్దార్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ వి.విక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.