ప్రజావాణి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి: కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి 82 ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన చోట క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ శాఖ 51, వ్యవసాయ శాఖ 3, ల్యాండ్ రికార్డ్ శాఖ 3, మునిసిపాలిటీ 7, గ్రామీణ అభివృద్ధి శాఖ 5,  పంచాయితీ శాఖ 3, విద్యాశాఖ 3, జిల్లా పరిషత్ 2, సివిల్ సప్లై, పోలీసు,  ఇరిగేషన్, విద్యుత్, ఉపాధి కల్పన శాఖలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి బెన్షా లోమ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె గంగాధర్, జిల్లా పరిషత్ సిఇఓ శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ,  కలెక్టరేట్ ఎ.ఓ. జగన్మోహన్ ప్రసాద్, జిల్లా అధికారులు ఉన్నారు.