రుణమాఫీని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

Loan waiver should be availed by: Collectorనవతెలంగాణ – గోవిందరావుపేట

రాష్ట్ర ప్రభుత్వం అందించిన వ్యవసాయ రుణమాఫీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. గురువారం మండలంలోని పసర గ్రామంలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులను ఖాతాదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కెనరా బ్యాంకు ద్వారా ఎంత మంది రైతులకు లబ్ధి చేకూరిందని బ్యాంకు మేనేజర్ ను మరియు ఫీల్డ్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకున్నారు. రైతుల వ్యవసాయ రుణమాఫీ సక్రమంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఇతర రుణాలతో ముడిపెట్టి ఇబ్బందులు పెడుతున్నారు అన్న రైతుల ఫిర్యాదులను పరిగణలకు తీసుకొని ప్రశ్నించారు. వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండి రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని అన్నారు. తాడువాయి బ్రాంచ్ లో మహిళా సంఘాల రుణాలు కడితేనే వ్యవసాయ రుణమాఫీ అవుతుందని రైతులు తెలుపగా సంబంధిత ఏ ఈ ఓ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దగ్గరుండి సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. ఇలాంటి సమస్యలు మరోమరు ఉత్పన్నం కాకూడదని అన్నారు . రుణమాఫీ పొందిన మహిళ రైతులను మాఫీ వచ్చిందా కొత్త రుణాలు ఇస్తున్నారా కొత్త రుణంతో ఏం చేస్తారు అని అడిగారు. రుణమాఫీ జరిగిందని కొత్త రుణాలతో వ్యవసాయ పెట్టుబడులు పెడుతున్నామని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారి కె జితేందర్ రెడ్డి ఏఈవోలు భూపాల్ రెడ్డి దాదా సింగ్ లు మరియు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.