రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పునరుద్దరణ పనులను విద్యార్ధులకు సౌకర్యవంతంగా ఉండేలా చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారి ప్రసాద్ కు ఆదేశించారు. పెద్దవాగు ప్రాజెక్ట్ గండి ని పరిశీలించడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన కోసం ఆదివారం వచ్చిన ఆయన ముందుగా గిరిజన సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాల ను సందర్శించారు. వాస్తవానికి ఈ కళాశాల భవనాలు ఆశ్రమ బాలురు ఉన్నత పాఠశాల కోసం నిర్మించారు.అయితే ఇక్కడ విద్యార్ధులను సున్నం బట్టి తరలించి ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నారు.డిగ్రీ కళాశాల కు అనుగుణం ఈ భవన సముదాయాలను పునరుద్ధరించడం కోసం రూ.47 లక్షలు కు ప్రతిపాదన పంపారు.ఇది టెండర్ ప్రక్రియలో ఉంది. ఈ క్రమంలో ఆయన ఐటీడీఏ పీ.ఓ రాహూల్ తో కలిసి కళాశాలను సందర్శించి పునరుద్ధరణ పనులు నాణ్యత గా ఉండాలని,విద్యార్ధులకు సౌకర్యవంతంగా చేపట్టాలని ఆయనను ఆదేశించారు.ఆయన వెంట తహశీల్దార్ వి.క్రిష్ణ ప్రసాద్,ఎం.పి.డీ.ఓ శ్రీనివాస్,కళాశాల ప్రిన్సిపాల్ జయ,సిబ్బంది ఉన్నారు.