నవతెలంగాణ -భువనగిరిరూరల్
సీఎం కప్ టోర్నమెంట్ పోటీలకు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహించడానికి జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులను బస్సులను శనివారం కలెక్టర్ పమేలా సత్పతిజెండా ఊపి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించారు.ఈనెల 22 నుండి 24 వరకు జిల్లా స్థాయిలో జరిగిన క్రీడా పోటీలలో ఎంపిక కాబడిన 85 మంది పురుషులు 35 మంది మహిళ క్రీడాకారులు మొత్తము 138 మంది క్రీడాకారులను , 11 కోచ్ మేనేజర్లను ముగ్గురు లైజనింగ్ ఆఫీసర్లను మూడు బస్సులలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రాష్ట్రస్థాయి ఎంపికలకు హైదరాబాదులోని జింఖానా గ్రౌండ్స్ లాల్ బహుదూర్ స్టేడియం గచ్చిబౌలి స్టేడియం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం లో జరిగే పోటీలకు పంపించనునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ప్రశాంత్ రెడ్డి, సెక్టోరియల్ ఆఫీసర్ అండాలు, హెచ్డిఎఫ్ సెక్రటరీ స్టాలిన్ బాబు, పీడీలు బాలకష్ణ , పిఈటిలు నరసింహ, మధుసూదన్, గోపాల్, సునీత భావన , ఉష, కేసు నాగులు, ఆఫీస్ సిబ్బంది , సిలువేరు సైదులు పాల్గొన్నారు.