చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం: కలెక్టర్

Will buy to the last grain: Collectorనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండలం సైదాపురం బుధవారం, ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతు రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.  కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులను  ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎట్టిపరిస్థితుల్లో కూడా ఏ ఒక్క రైతు నష్ట పోకుండా దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేయొద్దని , ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని అన్నారు. రైతులు తెచ్చిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు అందేలా చూడాలని సంబంధిత అధికారులను సూచించారు.  ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.