జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్..

The collector wished Sankranti to the people of the district..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భోగి, మకర సంక్రాంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భోగభాగ్యాలతో సిరి సంపదలతో ప్రజలందరూ ఆనందంగా, సుఖంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి జిల్లా ప్రజలలో నూతన కాంతులు తీసుకురావాలని, ఆనందోత్సాహాలతో సంక్రాంతి జరుపుకోవాలనీ, సంక్రాంతి సందర్భంగా ఆయన జిల్లా ప్రజలతోపాటు, ప్రజాప్రతినిధులు,అధికారులు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.