కాలేజ్ సాంక్షన్ చేశారు.. నిర్మాణం మరిచారు..

– అయోమయంలో మండల విద్యార్థులు..

– మండల కేంద్రంలో గల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అడ్మిషన్ల నిర్వహణ..
– సొంత భవనం లేకపోవడంతో అయోమయంలో ఉపాధ్యాయులు.. విద్యార్థులు
– జూనియర్ కాలేజ్ కు సహకరించని గెస్టెడ్ హెడ్మాస్టర్లు..
– గత సంవత్సరం నవంబర్లో కళాశాల సాంక్షన్ అయ్యింది..
– సిద్ధంగా ఉన్న పాఠ్యపుస్తకాలు..
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసుకోవాలని నాగిరెడ్డిపేట మండల ప్రజల విద్యార్థుల ఆకాంక్ష ఉండేది. 2023 నవంబర్లో నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ప్రభుత్వ మంజూరు చేసింది. కానీ కళాశాల భవనం నిర్మాణం చేయడంలో విఫలం కావడంతో గత సంవత్సరం మండల కేంద్రంలో గల జెడ్ పి హెచ్ స్ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్లు నిర్వహించడానికి ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేయడం జరిగింది. ఆలస్యంగా కళాశాల మంజూరు కావడంతో నవంబర్లో కొంతమంది ఓపెన్ టెన్త్ చేసిన విద్యార్థులు ఓపెన్ ఇంటర్ గా ఒక 20 మంది కళాశాలలో అడ్మిషన్ కావడం జరిగింది. గత సంవత్సరం అడ్మిషన్ అయిన విద్యార్థులు ఎగ్జామ్ ఫీస్ కట్టలేక పోవడంతో వారు పరీక్ష రాయలేకపోయారు. 2024 -25 జూన్ మొదటివారం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్లు మండల కేంద్రంలో గల జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలోనే ఒక తరగతి గదిలో నిర్వహిస్తున్నారు. గురువారం వరకు 62 మంది విద్యార్థులు మొదటి సంవత్సరంలో అడ్మిషన్ అయ్యారు. ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఎంపీసీ,  బైపిసి, సిఇసి, హెచ్ఈసి తెలుగు ఇంగ్లీష్ మీడియం అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు.
అయోమయంలో విద్యార్థులు లెక్చరర్లు..
ప్రస్తుతం జూనియర్ కళాశాల సొంత భవనం లేకపోవడంతో మండల కేంద్రంలో గల జెడ్ పి హెచ్ స్ పాఠశాలలో ఒక గది కేటాయించి అడ్మిషన్ల నిర్వహణ కొనసాగిస్తున్నారు. విద్యార్థులు అడ్మిషన్ అయిన తర్వాత తరగతులు ఎక్కడ నిర్వహించాలని లెక్చరర్లు సందేహంలో ఉన్నారు. అదేవిధంగా అడ్మిషన్ అయిన తర్వాత తరగతులు నిర్వహిస్తారా నిర్వహించరా అసలు ఏంటి పరిస్థితి సొంత భవనం లేదు తరగతుల ఏర్పాటు లేదు అసలు ఎవరు సహకరించట్లేదు ఏంటి పరిస్థితి అని విద్యార్థులు అయోమయం పరిస్థితిలో ఉన్నారు.
తాత్కాలిక లెక్చరర్ల తోటి అడ్మిషన్ల ప్రక్రియ..
ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్ల ప్రక్రియ తాత్కాలిక లెక్చరర్ల తోటే నిర్వహిస్తున్నారు. పిట్లం జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న విష్ణు ఎల్లారెడ్డి ప్రభుత్వాల జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న నాగయ్య తో పాటు ప్రిన్సిపల్ గా హేమచందర్ ను నియమించారు.
గత రెండు సంవత్సరాల క్రితం భవనం నిర్మాణానికి స్థల పరిశీలన..
నాగిరెడ్డిపేట్ మండలానికి జూనియర్ కళాశాల మంజూరు ప్రక్రియ కంటే ముందు భవన నిర్మాణం చేయడానికి గోలి లింగాల్ బీటీ రోడ్డు పక్కన ప్రభుత్వ భూమిలో జూనియర్ కళాశాల నిర్వహించాలని అప్పటి సంబంధిత అధికారులు స్థలాన్ని పరిశీలించి పోవడం జరిగింది.
వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకుంటే కళాశాల తరలిపోయే అవకాశం ఉంది..
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్న జూనియర్ కళాశాల లో విద్యార్థుల శాతం అనుకున్న స్థాయికి రాకపోతే కళాశాల నాగిరెడ్డిపేట నుంచి తరలిపోయే అవకాశం ఉంది. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కొనసాగాలంటే గెస్టెడ్ హెడ్మాస్టర్లు కళాశాలకు పూర్తిస్థాయిలో సహకరిస్తే ఖచ్చితంగా కళాశాల ఇక్కడే కొనసాగే అవకాశం ఉంది. గెజిటెడ్ హెడ్మాస్టర్ లతోపాటు ఆయా గ్రామాల ప్రజాపతినిధులు  విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కళాశాల వైపు మళ్ళిస్తే జూనియర్ కళాశాల నాగిరెడ్డిపేట్ మండల్ లో కొనసాగే అవకాశం ఉంటుంది. అనుకున్న స్థాయిలో విద్యార్థులు కళాశాలలో చేరితే తరగతి గదులు ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యాకల్టీని సంబంధిత శాఖ అధికారులు నియమిస్తారని ప్రిన్సిపల్ హేమచంద్ర పర్కొన్నారు.
ప్రిన్సిపల్ హేమచంద్ర వివరణ..
నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో ప్రారంభించబడిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రస్తుతం అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతా ఉంది విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్ చేసుకోవడంతో పాటు పాఠ్యపుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాము.  అదేవిధంగా సంవత్సరంకు ఒకసారి రు.5000 స్కాలర్షిప్ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని నాగిరెడ్డిపేట్ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము.
లెక్చరర్ విష్ణు వివరణ..
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల అడ్మిషన్లు పెంచడానికి గ్రామ గ్రామాన తిరుగుతూ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల ఫోన్ నెంబర్లు తీసుకుని వాళ్ళ ఊర్లకు ఇంటికి వెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించి కళాశాల అడ్మిషన్లు నిర్వహించుకుంటున్నాము ఇప్పటివరకు 62 మందిని అడ్మిషన్ చేయడం జరిగింది.