రంగు

రంగుఅతడు ..కురుక్షేత్ర నాటకంలో
శ్రీకృష్ణ పాత్ర వేసేడు గుర్తు పట్టేను
హరిశ్చంద్రలో నక్షత్రక పాత్ర వేసేడు గుర్తుపట్టేను
గయోపాఖ్యానంలో గయుడు పాత్ర వేసేడు గుర్తు పట్టేను!
యిలా.. అతడు ముఖానికి రంగేసుకున్నప్పుడల్లా పోల్చుకున్నాను!
యివాల.. బతుకు నాటకంలో.. అతడు యే రంగూ వేసుకోలేదు
అయినా.. పోల్చుకోలేక పోతున్నాను !
బహుశ .. ముఖానికి బదులు మనసుకు రంగేసుకున్నట్లున్నాడు !!
– సిరికి స్వామి నాయుడు