ఇచ్చుటలో ఉన్న హాయీ…

ఇచ్చుటలో ఉన్న హాయీ...ప్రేమ… ఓ మధుర జ్ఞాపకం. ప్రేమికుల దినోత్సవం వచ్చిందంటే చాలు… ఒక విశిష్టరీతిలో తమ అభిమానాన్ని, ప్రేమను వ్యక్తం చేయడం నిజంగా ఓ సవాలు వంటిదే. ప్రేమ.. రెండక్షరాలే కాని అణుబాంబు కంటే బలమైనది. మనం దిగుమతి చేసుకుంటున్న సాంప్రదాయాల్లో ‘ప్రేమికుల రోజు’ యువత మస్తిష్కాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకొంది. ఓ వైపు సంప్రదాయవాదులు ఇది సరికాదని హెచ్చరిస్తున్నప్పటికీ ప్రేమికుల రోజుకు మద్దతిస్తున్న వారు ఉత్సాహంగా వేడుకలు జరుపుతున్నారు. ప్రేమికుల మనోభావాలను దష్టిలో ఉంచుకున్న వ్యాపార సంస్థలు, వెబ్‌సైట్‌లు సరికొత్త తరహాలో వారిని ఆకర్షిస్తున్నాయి. ‘ఇంటర్నెట్‌’ ప్రేమాయాణాలకు అదే ‘ఇంటర్నెట్‌’ లో అందమైన కానుకలు కూడా అందుతున్నాయి. 1847 లో ”ఈస్టర్‌ హాలెండ్‌” అనే మహిళ మసాచూసెట్‌ లో వాలెంటైన్‌ కార్డుల తయారీకి నాంది పలికారు. యూఎస్‌ గ్రీటింగ్‌ కార్డుల సంఘం అంచనా ప్రకారం ఒక్క ప్రేమికుల రోజునే ఒక బిలియన్‌ కార్డులు ఇవ్వబడతాయని తెలిపింది. పూలు, చాక్‌లెట్లు, అందమైన బొమ్మలు ఇవ్వడం అంతా పాత ట్రెండ్‌. ప్రేమికురాలికి ఆనందాన్ని కలిగించే అందాన్ని బహుమతిగా అందిస్తున్నారు. ఏదేమైన ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేనే లేదని ‘ఆత్రేయ’గారన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. ప్రేమికుల రోజు కోసం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ వెబ్‌ సైట్లు అద్భుతమైన ఆఫర్లను వెల్లువలా ప్రకటిస్తాయి. కొందరు సరదాగా విహరిస్తారు. కొందరు పార్టీలకు, పబ్‌లకు, వేడుకలకు సమాయత్తం అవుతారు. ప్రేమని వ్యక్తపరిచే బహుమానం అతి విలువైనది, లేదా అతి తక్కువ ధరది ఐనా పర్లేదు , ఎదుటివారి మనసు దోచేస్తే చాలు! అలాంటి కొన్ని కళారూపాలు !!
– ఆదిత్య వైనతేయ, కామారెడ్డి