– కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్వాయి నాగరాజు
నవతెలంగాణ – నూతనకల్
ఓటమిని జీర్ణించుకోలేక ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామే ల్ పై తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యానాలను తీవ్రంగా ఖండించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్వాయి నాగరాజు గురువారం ఒక ప్రకటనలో అన్నారు . మాజీ ఎమ్మెల్యే తనకు తానే ఊహించుకొని భ్రమలో మధ్యంతర ఎలక్షన్లు వస్తాయని కేసీఆర్ సీఎం అవుతారని మళ్లీ నేనే ఎమ్మెల్యేని అని మాట్లాడడం హాస్యాస్పందామని అన్నారు. తుంగతుర్తి ప్రజల తీర్పును గౌరవించకుండా అహంభావంతో అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని ఇకనైనా నీ అహంకారపూరిత మాటలు మానుకోవాలి అన్నారు. అతను అభివృద్ధి చేసి ఉంటే ఓటమికి గురికాకపోవని ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేయ డాని అలవాటు చేసుకోవాలని సూచించారు.