– ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అవమానించడం సిగ్గుచేటు
– బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు మన్నే జయేందర్ ఖండన
నవతెలంగాణ-కందుకూరు
కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు మన్నే జయేందర్ బుధవారం మండల కేంద్రంలో పత్రికా ప్రకట నలో ఖండించారు. ప్రజా పాలన అని చెప్తున్న కాంగ్రెస్ నాయకులు అదే ప్రజా పాలనలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రొటోకాల్ విషయంలో ఎందుకు పాటించలేదని విమర్శించారు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని, బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అవమానించడం సిగ్గుచేటన్నారు. ఏ హౌదా ఉందని కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌ని ప్రభుత్వ కార్యక్ర మంలో భాగ్యస్వామ్యం చేస్తున్నారన్ని మండిపడ్డారు. కాం గ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని విమ ర్శించే హక్కు లేదన్నారు. కందుకూరు మండలంలో ఎం పీపీ బీజేపీకి చెందిన వా రు ఉన్నా, ఎమ్మెల్యే సబి తా ఇంద్రారెడ్డి మంత్రి స్థా యిలో ఉన్నా, ఏ రో జూ ప్రొటోకాల్ ఉల్లం ఘనకు పాల్పడలేదని తెలిపారు. అంబేద్కర్ రా సిన రాజ్యంగానికి కాం గ్రెస్ నాయకులు తూట్లు పొడుస్తూ, ఓడిన వారిని ముందుకు తెచ్చి ప్రభుత్వ కార్య క్రమాల్లో భాగ్యస్వామ్యం చేస్తా మంటే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చ రించారు. రాబోయే స్థాని క ఎన్నికల్లో అధికార పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థులు ఓడిపోతే మండలంలో గ్రామాల్లో ఓడిన అభ్యర్థులే పరిపాలన చేసా ్తరేమో అనీ సందేహం కలుగుతుందన్నారు. ఎమ్మెల్యే సబి తా ఇంద్రారెడ్డి వెన్నంటే ఉండి లబ్ది పొందిన నాయకు లు, బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్లి విమర్శించడం తగదని హితువు పలికారు. ప్రజ లు కాంగ్రెస్ ప్రజా పాలనపై ఎదిరించే రోజులు దగ్గర్లో నే ఉన్నాయని హెచ్చరించారు. ఇకనైన కాంగ్రెస్ నాయ కులు విమర్శలుమాని, పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలయ్యే విధంగా కృషి చేయాలని కోరారు.