మరణించిన సిబ్బంది కుటుంబానికి చెక్ అందించిన పోలీస్ కమీషనర్

నవతెలంగాణ –  కంటేశ్వర్
మరణించిన సిబ్బంది కుటుంబానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చేతుల మీదుగా చెక్కును అందజేశారు. గత ఏడాది తేది: 9-8-2023 నాడు సాయంత్రం సమయంలో బాల్కొండ పోలీస్ స్టేషన్ యందు విధులు నిర్వహిస్తున్న ఎమ్. జలంధర్, హోమ్ గార్డ్  764 ను ద్విచక్ర వాహనంపై వెళ్లే సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొనగా మరణించడం జరిగింది. హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ ద్వారా వచ్చిన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్  రూపంలో గల చెక్కు రూ॥ 30,00,000/- ( ముపై లక్షల రూపాయల ) చెక్కును మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమీషనర్  కల్మేశ్వర్ శింగెనవార్, ఐ.పి.యస్ చేతుల మీదుగా కీ॥ శే॥ ఎమ్. జలంధర్ సతీమణి అయిన అర్చన కి చెక్కును అందజేయడం జరిగినది.ఈ సందర్భంగా అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ ( లా అండ్ ఆర్డర్ ) ఎస్.జయ రామ్, ప్రొబేషనరి ఐ.పి.యస్., బి. చైతన్య రెడ్డి, హోమ్ గార్డ్సు ఎ.సి.పి  పి.అరుణ్ కుమార్, బాల్కొండ ఎస్.ఐ కె. గోపి, హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ మేనేజర్ కె. గంగాధర్, సాలరీ మేనేజర్  సంపత్ రెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.