కమ్యూనిటీ కోఆర్డినేటర్ కు ఘనంగా సన్మానం ..

A great honor to the community coordinator..నవతెలంగాణ – జక్రాన్ పల్లి 

మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ కు ఘనంగా సన్మానం నిర్వహించారు. మండలంలోని ఐకెపి కార్యాలయంలో పనిచేస్తున్న కమ్యూనిటీ కోఆర్డినేటర్  రాములు మండలంలో జిల్లా స్థాయి వరకు అన్ని టార్గెట్లను పూర్తిచేయడం, అన్ని పనులలో ముందంజలో ఉంచడంతో జిల్లా స్థాయి అధికారులు గుర్తించి గణతంత్ర దినోత్సవం వేడుకల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల సమైక్యాలు ఉన్న సమైక్య సభ్యులు తోటి ఉద్యోగులు అందరూ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం రవీందర్ రెడ్డి, మండల సమైక్య కార్యవర్గం కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, మండల సమైక్య సిబ్బంది,అన్ని గ్రామాల నుంచి వచ్చిన గ్రామ సంఘం అధ్యక్షులు తదితరులు ఉన్నారు.