
– ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు – ఎస్.ఐ శివరాం క్రిష్ణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ర్యాగింగ్ అనే భావనే ఏదో మనో వైకల్యం తో కూడిన ప్రవర్తన అని,ఆడవారిని మగవారు కాని,మగవారిని ఆడవారు కాని ఎవరిని ఎవరు బెదిరించి నా,మానసికంగా,శారీరకంగా ఏ విధమైన హింస అయినా ర్యాగింగ్ పద్ధతే అవుతుందని సీఐ కరుణాకర్ తెలిపారు. స్థానిక వ్యవసాయ కళాశాల విద్యార్ధులకు కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగంలో శుక్రవారం ర్యాగింగ్ నివారణ పై పోలీస్ శాఖ ఆద్వర్యంలో అవగాహన నిర్వహించారు. కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంత్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన కార్యక్రమానికి సీఐ కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బెదిరింపు, భయపెట్టడం, కొట్టడం, తిట్టడం, హింసించడం లాంటివి అన్నీ ర్యాగింగ్ పరిధిలో కే వస్తాయని ఆయన వివరించారు.ర్యాగింగ్ అనే భావనను విడనాడి తే సోదర సౌభ్రాతృత్వం విరాజిల్లుతుంది అని,అపుడే ఒకరికొకరు పరస్పరం స్నేహపూరిత వాతావరణంలో మెలుగుతారు అని అన్నారు. ఎవరు ఎవరి పై ఏ విధమైన ర్యాగింగ్ కు పాల్పడినా నేరమే అవుతుందని,క్షణికావేశంలో నో లేక తక్షణం ఆనందం కోసం చేసే తప్పిదాలు జీవితాంతం వేధిస్తాయి అని ఎస్ఐ శివరాం క్రిష్ణ తెలిపారు.ర్యాగింగ్ ప్రీ కళాశాల గా గుర్తింపును తేవడానికి విద్యార్ధులు క్రమశిక్షణతో లక్ష్యం పై దృష్టి సారించాలని ఏడీ హేమంత్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్స్ ఓఎస్ ఏ మధుసూదన్ రెడ్డి,ఐవీ శ్రీనివాసరెడ్డి,గోపాల క్రిష్ణ మూర్తి,నాగాంజలి,ఏవో జయమ్మ,కే.శిరీష,పి.రెడ్డి ప్రియ,టి.శ్రావణ్ కుమార్ లు పాల్గొన్నారు.