దోషులను కఠినంగా శిక్షించాలని ఆందోళన

The concern is that the culprits should be severely punishedనవతెలంగాణ – సిరిసిల్ల
కలకత్తా జూనియర్ డాక్టర్ పై జరిగిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన ఆసుపత్రి వైద్యులు డిమాండ్ చేశారు. వారం రోజుల క్రితం కలకత్తా ఆర్జి-కెఏఆర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్యను ఖండిస్తూ జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం వైద్యులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి, బాధితురాళి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, సిబ్బందికి సెంట్రల్ ప్రొటక్షన్ ఆక్ట్ కచ్చితంగా అమలు చేయాలన్నారు. అలాగే ఈ కేసును సిబిఐ కి అప్పగించి ధైర్యాప్తు చేయించి, 72 గంటల లోపు విచారణ జరిపి నిందితులను గుర్తించి, వారికి శిక్ష పడేలా చూడాలన్నారు. లేనిపక్షంలో నిరసన కార్యక్రమాలు ఉదృతం చేసి, వైద్య సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపర్డెంట్ చీకోటి సంతోష్, ఆర్ఎంఓ లు కాశీనాథ్, సాయి, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.