– గుంతలు మెట్టలుగా మారిన యాచారం నందివనపర్తి రోడ్డు
– కంకర తేలిన ధర్మన్నగూడ పెద్దతుండ్ల రోడ్డు
– అధ్వానంగా మారిన మేడిపల్లి రోడ్డు
– బురదమయంగా యాచారం బస్టాండ్ రోడ్డు
– పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు
– మొద్దు నిద్రలో సంబంధిత అధికారులు
– రోడ్లను బాగు చేయండి: స్థానికులు, వాహనాదారులు
నవతెలంగాణ-యాచారం
మండల పరిధిలోని వివిధ గ్రామాల రోడ్ల ప రిస్థితి అస్తవ్యస్తంగా తయారయింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. వాహనాలు రాకపోకలు సాగించాలం టేనే జంక్కుతున్నారు. పాదాచారులు నడవలేక ఇ బ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని యాచారం నుంచి నందివనపర్తికి వెళ్లే రోడ్డు మొత్తం గుంతలు, మెట్టెలు గా చెరువును తలపించేలా మా రింది. యాచారం బస్టాండ్ ఆవ రణలో రోడ్డు అంతా బురద మ యంగా ప్రయాణికులు నడవలేని దుస్థితికి చేరుకుంది. ధర్మన్నగూడ, పెద్దతుండ్ల వైపు వెళ్లే రోడ్డు మొత్తం కం కర తేలి నిత్యం ప్రమాదాలకు గురవుతున్నమని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్కీజ్ గూడ నుంచి మేడిపల్లి నక్కర్త వైపు వెళ్లే రోడ్డు మొత్తం గుంతలుగా తయారయింది. దీంతో కొన్ని రోజులుగా స్థానికు లు నిత్యం ఇబ్బందులకు గుర వుతున్నామని గ్రామ స్తులు ఆరోపిస్తున్నారు. మండల పరిధిలోని మరి కొన్ని గ్రామాల రోడ్ల దుస్థి తి అధ్వానంగా తయార యింది. ఈ సమస్యపై ఆర్‌అండ్‌బి అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించు కోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇ బ్బంది ఉన్న ఆర్‌అండ్‌బి అధికారులు మాత్రం మొ ద్దు నిద్రలో ఉన్నారని స్థాని కంగా ప్ర జలు మండిపడుతున్నారు. ఇబ్ర హీంపట్నం ఆర్‌అండ్ బిడీఈ, పంచాయతీ రాజ్ ఏఈలు కన్నె త్తి చూడటం లేదని, నిత్యం నిర్ల క్ష్యం చేస్తున్నారని వాహనదా రు లు విమర్శిస్తున్నారు. ఈ రోడ్ల ను బాగు చే యండని మహాప్రభు అన్నా కూడా ఆర్‌అండ్‌బి అధికారు లకు చీమకుట్టినట్లు కూడా లేదని స్థానికు లు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్లను బాగు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
వెంటనే మరమ్మతులు చేపడతాం
రోడ్ల సమస్యలపై ఆర్ అండ్‌బి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే మరమ్మతులు చేపడుతాం. స్థానిక ప్ర జల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయంపై ఆర్‌అండ్‌బి డీఈ, ఏఈలు స్పందించేలా చర్యలు తీసు కుంటాం. యాచారం నందివనపర్తి రోడ్డు దుస్థితిపై వా రికి తెలియజేశాం. స్పందించడంలో నిర్లక్ష్యం జరుగుతున్న మాట వాస్తవ మే. రోడ్ల బాగు కోసం వెంటనే మరమ్మతులు చేపడుతాం. ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ గుంతలు మెట్టలుగా తయారైనా విషయం మాదృష్టికి వచ్చింది. వెంటనే రోడ్ల మరమ్మ తులకు చర్యలు తీసు కుంటున్నాం.
నరేందర్ రెడ్డి,ఎంపీడీవో