నవతెలంగాణ- నేరేడుచర్ల
నేరేడుచర్ల మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డులో బట్టు వాని కుంట ఊరుకు అతి సమీపంలో ఉన్న బండమీద డంపింగ్ యార్డ్ లోచెత్త పోయడం ద్వారా డంపింగ్ యార్డ్ కు నిప్పంటుకొని ఊరు మొత్తం పొగ కమ్మి వేయటం గురువారం జరిగినది. దాని ద్వారా గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని 8 వవార్డు కౌన్సిలర్ కొదమగుండ్ల సరిత అన్నారు. ఈరోజు డంపింగ్ యార్డ్ స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడుతూ బండమీద డంపింగ్ చెత్త పోయొద్దని నియమ నిబంధనలు ఉన్న, అధికారులు దౌర్జన్యంగా చెత్త పోస్తున్నారని ఆమె అన్నారు. ఊరికి 50 మీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్ ఉండటంవల్ల డంపింగ్ యార్డ్ కు నిప్పు అంటుకొని దానిలో నుంచి వచ్చే దుర్వాసన పొగ వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురై ఊరును వదిలిపెట్టి, పొగకు తట్టుకోలేక ఊరు బయటకు చిన్నలు పెద్దలు వెళ్లి ఉంటున్నారని వెంటనే అధికారులు పరిశీలించి డంపింగ్ యార్డ్ ని ఇక్కడి నుంచి తొలగించాలని ఆమె అధికారులను కోరారు.