కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది..

నవతెలంగాణ- తొగుట
కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిందని వెంకటరావుపేట మాజీ ఎంపీటీసీ కంకణాల నరసింహులు, చందాపూర్ మాజీ సర్పంచ్ బొడ్డు నర్సింలు అన్నారు. ఆదివారం దేశ రాజధాని లో బిజెపి ప్రభుత్వం 27 సంవత్సరాల తర్వాత ఏర్పడిన సందర్భంగా గంధమాల గ్రామం లో మదన దుర్గమ్మకు మొక్కులు చెల్లించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జండా ఎగరవేయడం ఖాయం అన్నారు తెలంగాణలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బిజెపి మెజార్టీ స్థానాలు గెలుచుకుంటామని దిమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో 14 నెలలు గడుస్తున్న ఆరు పథకాలను అమలు చేయలేక పోయిందని ఆరోపించారు.