– బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపాటు
నవతెలంగాణ హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలను, పోలీసులను ఎవ్వరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్రాంతి పండుగ చేసుకోనివ్వట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. దుర్మార్గంగా అరెస్టు చేయడం ప్రజా వ్యతిరేక పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు. పండుగ పూట తన నియోజకవర్గానికి తనను వెళ్ళనీయకుండా, ఇంత దారుణంగా గృహ నిర్బంధం చేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యల గురించి ఆలోచన చేయాల్సిన ప్రభుత్వం మాలాంటి ప్రజాప్రతినిధులపైన ఇలా కర్కాషంగా వ్యవహరించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి హౌస్ అరెస్టులు ఎన్నడూ చూడలేదు. తన నియోజకవర్గ పర్యటన నిమిత్తం ఎలాంటి ధర్నాలు రాస్తారోకోలు లేని ఈ పండుగ రోజు ఇలా పోలీస్ శాఖ వారు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ లాంటిది అని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.