అబద్దాలతో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం .

The government that cheated the people with lies is the Congress government..– అటకెక్కిన ఆరు గ్యారెం టీలు భరోసా లేని రైతు భరోసా 
– 420 హామీలు – 420 రోజులు 
– నిజామాబాద్ అర్బన్ మాజీ శాసనసభ్యులు  గణేష్ బీగాల 
నవతెలంగాణ-  కంఠేశ్వర్
రాహుల్ గాంధీ తెలంగాణ యువతకు హామీ ఇచ్చి 420 రోజులు గడిచిన సందర్భంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మహాత్మా గాంధీ విగ్రహాలకు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించి వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు  గణేష్ బిగాల గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవిగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది.డిక్లరేషన్ల పేరుతో, హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి.. 420 రోజులైనా హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.6 గ్యారెంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తో పాటు కాంగ్రెస్ నేతలంతా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటూ అబద్ధాలు చెబుతున్నారు. 2021 లోనే మా కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మీ బట్టి విక్రమార్క  పాల్గొన్నారు అని గుర్తు చేశారు.కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి. ప్రతి నిరుపేదకు రేషన్ కార్డులు రావాలనే ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆదాయ పరిమితిని సడలించారు.
గ్రామీణంలో 60 వేలు నుంచి 1.50 లక్షలకు, పట్టణంలో 75 వేలు నుంచి 2.50 లక్షలకు పెంచారు. మేనిఫెస్టోలో మేము పెట్టక పోయినప్పటికీ రేషన్ కార్డు ద్వారా కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి ఇచ్చే బియ్యంను 4కేజీల నుంచి 6కేజీలకు పెంచడం జరిగింది. కుటుంబానికి 20 కేజీలు ఉన్న పరిమితిని ఎత్తివేసి, ఎంతమంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి 6 కేజీలు ఇచ్చాము. 2.5 ఎకరాలు ఉన్న మాగాణి భూమిని 3.5 ఎకరాలకు పెంచాము. 5 ఎకరాలు ఉన్న చెలక భూమిని 7.5 ఎకరాలకు పెంచాము. కెసిఆర్ ప్రభుత్వంలో 6,47,479 నూతన రేషన్ కార్డులు జారీ చేశాము.రేషన్ కార్డులు జారీ కూడా ఏదో చారిత్రాత్మక కార్యక్రమమని ఎన్నడూ చెప్పుకోలేదు. కానీ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చారిత్రాత్మకమైన కార్యక్రమం అంటున్న ముఖ్యమంత్రి భావదారిద్య్రం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. బాండ్ పేపర్లు, అఫిడవిట్లు ఇచ్చి మరి ప్రజలను మోసగించారు.. గోబెల్ సిగ్గుపడేలా అబద్దాలను ప్రచారం చేశారు. తెలంగాణ యువతకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రాహుల్ గాంధీ మొహం చాటేసారు.ఇక్కడున్న రేవంత్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగాలు ఇవ్వండని అడిగిన నిరుద్యోగులను తీవ్రంగా కొట్టి జైల్లో వేస్తున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 420 రోజులు దాటుతున్న నాలుగో వంతు ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.
ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము.కెసిఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికెషన్స్ ని, కోట్ల ప్రజా ధనంతో సభలు పెట్టి తామే ఇచ్చినట్టు అబద్దాలు పలికి ఇప్పటి వరకు వారికీ జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు.కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన వంద రోజుల్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చేయలేదు, మోసపోయిన ప్రజల తరుపున టిఆర్ఎస్ పోరాటం చేస్తే 8 నెలలకు కొందరికి మాత్రమే రుణ మాఫీ చేశావు. మేము అధికారంలో ఉన్నప్పుడు కరోనా లాక్ డౌన్  నోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొని మా కెసిఆర్ గారు 28,275 కోట్ల రుణమాఫీ చేసిండు.రైతు భరోసాకు 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు అని ఇప్పుడు రైతు భరోసా 12 వేలు అంటూ ఒకసారి సంక్రాంతి, మరోసారి జనవరి 26 కు ఇస్తామని ఇప్పుడు మళ్ళీ మార్చి 31 కి అంటున్నావు.రైతు కూలీలకు 12 వేలు అన్నది భూటకం.అప్పుడు రైతు బంధు 10 వేలు బిక్షం అన్న రేవంత్ రెడ్డి  420 రోజులు గడుస్తున్నా రైతు భరోసా ఇవ్వలేదు.రైతు బందు సంవత్సరానికి రెండు విడుతలుగా క్రమం తప్పకుండ ఎకరాకు 10 వేల చొప్పున మొత్తం 73,162 కోట్లు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసిన ఘనత మా కెసిఆర్ ప్రభుత్వానిది.మీ అబద్దపు హామీలను నమ్మినా ప్రజలు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 420 రోజుల్లో రోజుకో రైతు చొప్పున 412 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 420 రోజుల్లో దాదాపు 100 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు.గురుకులాల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, కల్తీ ఆహారం తిని 55 మందికి పైగా విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మా కెసిఆర్ ప్రభుత్వంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందిస్తూ చెనేతలకు ఉపాధి కల్పించి వారికీ ఆర్థిక సహాయం అందించేవారు.గ్రామ సభలల్లో మీరు ఇచ్చిన హామీల గురించి మిమ్మల్ని ప్రశ్నించిన రైతులను పోలీసులతో, కాంగ్రెస్ గుండాలతో కొట్టిస్తున్నారు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేక టిఆర్ఎస్ పార్టీ పై నిందలు వేస్తున్నారు.కెసిఆర్ ప్రభుత్వం కళ్యాణ్ లక్ష్మి రూ. లక్ష 116 రూపాయలు ఇస్తే . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో వాటితో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పి సంవత్సరం గడిచిన ఇప్పటివరకు ఒక్క కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వలేదన్నారు. ఈ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చిన్న భిన్నం అవుతుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నం పెట్టే రైతన్న ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. రైతుబంధు ఇప్పటివరకు పడలేదు ఈ కార్యక్రమంలో మాజీ నగర మేయర్  దండు నీతు కిరణ్, మాజీ నుడా చైర్మన్ చామకూర ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు సిర్ప రాజు,సత్యప్రకాశ్, దండు శేఖర్,నవీద్ ఇక్బాల్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.