
నవతెలంగాణ -తాడ్వాయి
గ్రామసభల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మరో మారు మోసం చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల మండల సమన్వయ కమిటీ సభ్యులు జాజా చంద్రం, రామసాయం శ్రీనివాస్ రెడ్డి, కొమరయ్యలు అన్నారు. శుక్రవారం లింగాల ఎంపిటిసి పరిధిలో టిఆర్ఎస్ స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం గత నాలుగు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన గ్రామ సభలు బోగస్ సభలుగా మారాయన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరి చేయకుండా కేవలం అర్హులైన లబ్ధిదారులు అని పేర్లు చదువుతూ పేదలను మభ్య పెడుతున్నారన్నారు. నిజానికి గ్రామసభలో ఇళ్లు మంజూరికొరకు ఎంపిక చేయవలసి ఉన్నప్పటికీ అలా చేయకుండా పేదలను మోసం చేస్తున్నారన్నారు. .ములుగు నియోజక వర్గంలో అర్హులైన లబ్ధిదారులు సుమారు 60000 మంది ఉండగా, కేవలం 3500 ఇళ్లు మాత్రమే మంజూరి చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని దాచి అందరికీ ఇల్లు మంజూరి చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేస్తున్నట్లు విమర్శించారు. స్థానిక ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఇళ్ళ విషయం తో పాటు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరు గ్యారంటీలు మోసాన్ని ప్రజలలో ఎండకట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం లింగాల ఎంపీటీసీ పరిధి స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులుగా తోలెం వెంకటయ్య, చింత రమేష్ ,మోకాళ్ళ బుచ్చి రాములు సుతారి విజయ్ కుమార్, లక్ష్మీనారాయణ, కొమరం చంద్రయ్య, మరికిడి సాంబశివరావు ,పాయం జగన్, చేల శివకుమార్, యాప సతీష్, మొగిలిపెల్లినారాయణ, ఊకే కాంతారావు, చెన్నూరి అనిల్, పెండకట్ల కృష్ణ లను ఏకగ్రీవంగా జిపి సమన్వయ కమిటీ అధ్యక్షుడు చేల సారయ్య అధ్యక్షతన ఎన్నుకున్నారు.