– కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి.
నవతెలంగాణ – రాయపోల్
ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతుల కష్టాలు తీసిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మామిడి మోహన్ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో లక్ష రూపాయల రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన ఎన్నికలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ హామీని నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. మాజీ మంత్రి హరేశ్ రావు రాజీనామాకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. బిఆర్ఎస్ నాయకులు రైతులకు అబద్దాల ప్రచారం చేస్తూ రైతులను మభ్య పెడుతున్నారని దేశ చరిత్రలో రూ. 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అన్నారు.ప్రతి రైతును రుణ విముక్తి చేసి రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు.రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. బీఆర్ఎస్, బిజెపి పార్టీల అబద్దాపు ప్రచారలు మానుకోవాలని హెచ్చరించారు. మాట ఇచ్చిన ప్రకారం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధికార ప్రతినిధి కృష్ణ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొంగరి దయాకర్, మండల సీనియర్ నాయకులు సత్తుగారి కిష్టారెడ్డి, రేకుల లక్ష్మారెడ్డి, జనార్దన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, నరసింహారెడ్డి, ప్రవీణ్, ప్రశాంత్, లక్ష్మణ్, లచ్చయ్య, రామచంద్రం, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు.