
రైతులకు మాట ఇచ్చిన ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ మండల నాయకులు జాల మల్లేష్ యాదవ్ అన్నారు.చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చిత్రపటాలకు రైతులు,కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి శనివారం పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా జాల మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని పనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి రైతుల పక్షపాతి ప్రభుత్వం అనడానికి నిదర్శనం అని అన్నారు.రాబోయే కాలంలో ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని తెలిపారు. అధికారం చేపట్టిన 7 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన కొనసాగిస్తూ,అనేక సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోతున్నారని పేర్కొన్నా రు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కొంతం వెంకట్ రెడ్డి మాజీ వార్డు సభ్యులు మునగాల శివాజీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు మారసాల శ్రీకాంత్, ఎన్నపల్లి ముత్తిరెడ్డి,ఎన్నపల్లి రవీందర్ రెడ్డి,కొంతం శేఖర్ రెడ్డి,మారసాల రాములు రైతులు మునగాల వెంకట్ రెడ్డి,గండికోట లింగయ్య, పల్లె చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.