ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాంగ్రెస్ సర్కార్ నైజం

The Congress government is keeping its promiseనవతెలంగాణ – రాయపర్తి
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడమే కాంగ్రెస్ సర్కార్ నైజం అని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఝాన్సీ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కొండూరు గ్రామంలో పెద్ద చెరువును సుమారు 9 లక్షల 75 వేల రూపాయలతో మరమ్మతు పనులు చేయడానికి పనులను ప్రారంభించారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి సమయానుకూలంగా నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదు అని చేతల ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. రుణమాఫీతో రైతుల  కళ్ళల్లో ఆనందం వెల్లువిరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హామ్య నాయక్, మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కృష్ణమాచార్యులు, మహేందర్ రెడ్డి, సరికొండ కృష్ణారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఎసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉల్లంగల నర్సయ్య, ఉల్లంగల యాదగిరి, సుదర్శన్ రెడ్డి, అఫ్రోజ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు గిరాగని రాజు గౌడ్, కుందూరు రాంరెడ్డి, పంతంగి యాకయ్య, గిరిగాని వేణు తదితరులు పాల్గొన్నారు.