నవతెలంగాణ – జన్నారం
ప్రజా పాలన ముసుగులో రేవంత్ నియంత పాలన చేస్తున్నారు.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అలాగే మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై నాయకులపై పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని బిఅర్ఎస్ పార్టీ జన్నారం మండల ప్రధాన కార్యదర్శి సులువ జనార్ధన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో పత్రిక విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలంటే ముఖ్యమంత్రి వెన్నులో ఎందుకంత వణుకు..! దాడి చేసిన కాంగ్రెస్ గూండాలను వదిలి బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడం సిగ్గుచేటని అన్నారు. సీఎం కనుసన్నల్లో సాగుతున్న ఈ అక్రమ విధానాలను తెలంగాణ సమాజం గమనిస్తోందని విమర్శించారు. నిర్భందాలు అరెస్టులు ఆంక్షలు బిఆర్ఎస్ పార్టీకి కొత్తకాదని అరెస్టులకు బెదిరేది లేదని అధికారం ఎవరికీ శాశ్వతం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజా క్షేత్రంలో గుణపాఠం తప్పదని అన్నారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్ బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు కమ్మల విజయ ధర్మ, జిల్లా నాయకులు చిటిమల భరత్ కుమార్, మాజీ కో ఆప్షన్ సభ్యులు మున్వర్ అలీ ఖాన్, జిల్లా నాయకులు ఫజల్ ఖాన్, బోర్లకుంట ప్రభుదాస్, బాలసాని శ్రీనివాస్ గౌడ్, ఐలవేణి రవి శ్రీధర్ రావు దుమల్ల ఎల్లయ్య తదితర బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.