కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్ని అమలు చెయ్యాలని కోరుతూ మాజీ జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ శేఖర్ కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులకు ఒక ఎకరనా రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వాలని, రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చెయ్యాలని పేర్కొన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇవ్వాలని తెలిపారు. రేషన్ కార్డ్ లేని రైతులకు రేషన్ కార్డు ఇచ్చి, రైతులకు క్రాప్ ఇన్సూరెన్సు కల్పించాలని తెలిపారు. ఇందులో మండల బిఆర్ఎస్ మాజీ మండల అద్యక్షులు నర్సా గౌడ్, మాజీ సర్పంచ్ అశోక్ రావు, మండల కో అఫ్షన్ హైమద్, రమణ రావు, శ్యామ్ రావు, రఘు, దర్గాల సాయిలు తదితరులు పాల్గొన్నారు.