దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం..

– రెండు నెలలు నిద్ర లేని రాత్రులు గడిపా..
– ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేస్తే చీపురుతో కొట్టండి..
 – ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ లను తుంగలో తొక్కిందని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రెండు నెలలు నిద్ర లేని రాత్రులు గడిపానని, కళ్యాణ లక్ష్మి ,షాది మూబరక్ చెక్కులను పంపిణీ చేయడానికి వచ్చే ఎమ్మెల్యే ను మహిళలు చీపురుతో కొట్టాలని చెక్కుతో పాటు ఒక తులం బంగారం ఎక్కడనినిలదీయాలని, నిజామాబాద్ బిఅర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామం లోని గంగపుత్ర సంఘంలో మండల బిఅర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమెల్సీ వీ గంగాధర్ గౌడ్ తో కలిసి జిల్లా పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని మాట్లాడారు.ఎన్నికల సమయంలో ప్రజలకు మోసపూరిత హామీల తో మోసం చేసిందని, వారి మాటలు నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టారని,ఒక ఉచిత బస్సు తప్ప ఎమీ చేయలేదని వివరించారు. ప్రభుత్వం ఏర్పడి 4 నేలలు అయినా తెలంగాణలో ఒక్కటి కూడా హామీలు అమలు కాలేదని, ఆర్టీసీ బస్సులో ఆడవారికి ఉచితం తప్ప మిగిలిన ఏ హామీలు కూడా ఎందుకు అమలు కావటం లేదని ప్రశ్నించారు.  ఎంపిగా  ఐదేళ్లు చేసిన అరవింద్ ఏ గ్రామానికి వెళ్లి ఎన్ని నీదులు ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్కరోజైన గ్రామంలోని సమస్యలను పట్టించుకోని బీజేపీ అభ్యర్థి అరవింద్ మళ్లీ పోటీ చేస్తుంటడని, గ్రామాల్లో ఏమి పని చేయని అరవింద్ కు ఓటు అడగటానికి ఎలా వాస్తారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఎమ్మెల్సీగా ఉండి ఒక్కసారి కూడా మండలానికి  వచ్చింది లేదన్నారు. కోట్ల రూపాయలతో అబివృద్ధి చేశానని, అనునిత్యం వందలాది మంది తనవద్దకు వచ్చిన వారి పనులను చేసి పెట్టానని, పైరవీ కారులోనే పార్టీ నుంచి విడి ఇతర పార్టీలకు పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు.ఎప్పుడు పైరవి కారులోనే పోతుంటారని, నాయకులు పోరని బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందన్నారు. సిఎం కేసీఆర్ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశారని, ఆయన ఆదేశానుసారమే నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావన్నారు. బిఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసే ప్రజలు ఎన్నో నియోజకవర్గాలలో ఓటర్లు తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు. బీఆర్ఎస్ ఓటు శాతం ఎక్కువగా ఉందని, ప్రతిఒక్కరూ ఓటు వేసి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బాజిరెడ్డిని ఆశీర్వదించాలన్నారు. ఎంపి గా గెలిస్తే రానున్న రోజుల్లో  కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తనలో ప్రశ్నించే తత్వముందని, బాజిరెడ్డి ని గెలిపించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఓటమికి బయపడారని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేసి బాజిరెడ్డిని గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గడ్డం సుమనారవిరెడ్డి, ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, దర్పల్లి జడ్పీ టీసి బాజిరెడ్డి జగన్ మోహన్, వైస్ ఎంపీపీ భూసని అంజయ్య, మండల అధ్యక్షులు చిలువేరి దాస్, మండల మహిళ విభాగం అధ్యక్షురాలు పులి వసంత సాగర్, మండల రైతు కోఆర్డినేటర్ మోహన్ నాయక్, ఎస్సీసెల్ రూరల్ కన్వీనర్ పాశంకుమార్, సీనియర్ నాయకులు గడ్కోల్ శ్రీనివాస్, తేలు విజయకుమార్,ఎంపిటిసిలు చింతల దాస్, కచ్చకాయల అశ్విని శ్రీనివాస్, మారంపల్లి సుధాకర్, బాబు రావు, డీకోండ సరిత సుదిర్, తటిపాముల శ్రీనివాస్ గుప్తా, గంగాధర్, పులి శ్రీనివాస్, రఘునథన్ రాము, బిరీష్ శేట్టి, అరటి రఘు,  పాటు అన్ని గ్రామాల మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.