నవతెలంగాణ-చౌటుప్పల్: చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరు నుంచి చిన్న కొండూరు, చౌటుప్పల్, లక్కారం, ధర్మోజిగూడెంగేట్ ఎల్లంబాయి, కొయ్యలగూడెం, దేవలమ్మ నాగారం, పీపల్ పహాడ్ మీదగా అల్లాపురం శ్రీ సరళ మైసమ్మ దేవాలయం వరకు 25 కిలోమీటర్ల మేర కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అర్ధ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అర్ధ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజన్న అంటే నేనున్నానని పలికే మనసత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని తెలిపారు. పాదయాత్రగా పెద్ద కొండూరు నుంచి అల్లాపురం వరకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ప్రజలకు వివరించుకుంటూ పాదయాత్ర కొనసాగిందని తెలిపారు. చౌటుప్పల్ లో రాజగోపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద చౌటుప్పల్ జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి పాదయాత్ర బృందాన్ని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవాలని శ్రీ సరళ మైసమ్మ దేవాలయంలో 116 కొబ్బరికాయలు కొట్టామని చెప్పారు. పాదయాత్రలో పెద్ద కొండూరు ఎంపిటిసి బద్దం కొండల్ రెడ్డి, యాస నరసింహారెడ్డి గూడూరు నవీన్ రెడ్డి, బద్దం వెంకట్ రెడ్డి, బద్దం బాలవర్ధన్ రెడ్డిల బృందం పాల్గొన్నారు.