కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చింది 

నవతెలంగాణ – మద్నూర్ 
కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చిందని ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు బసరాజ్ పటేల్ తెలిపారు మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లరా గ్రామం లో ముఖ్యంగా ఆరు హామీలలో ఒకటైన గృహ జ్యోతి ఉచిత కరెంటు పతకం అమలు కావడం జరిగిందనీ పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం అమలుతో గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ఎస్ యు ఐ మండల అధ్యక్షులు బస్వరజ్ పటేల్. గ్రామ అధ్యక్షులు మధుకర్ పటేల్. గ్రామ ఉపాధ్యక్షులు మల్లికార్జున్ పటేల్ గనుపటెల్  నాగనాథ్ పటేల్ సురేష్ పటేల్,అశోక్ పటేల్,  గ్రామ ప్రజలు లైన్ మన్ ప్రకాష్ బిల్ కలెక్టర్ వెంకటేష్ తదితరులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.