
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని చింతలగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు రావుల స్వామి,గుండెబోయిన ఐలయ్య యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం చింతలగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పాల్గొన్న రావుల స్వామి, గుండెబోయిన ఐలయ్య యాదవ్, పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం చింతలగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించామని తెలిపారు . కాంగ్రెస్ పార్టి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు అందే విధంగా పార్టీ కార్యకర్తలు కృషి చేసి, రాబోయే స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ, సర్పంచ్, జడ్పిటిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు జువ్వి రఘుపతి, మాజీ సర్పంచ్ ఆవుల రేణుక గణేష్, వార్డు సభ్యులు బొమ్మ కంటి దీపికా కిషోర్ కుమార్, కో ఆప్షన్ సభ్యులు ఎర్రం శ్రీనివాస్, నాయకులు జువ్వి నిర్మల, బొమ్మ కంటి జానయ్య, కిరణ్ కుమార్, చిరగొని జంగయ్య, ధనరాజ్ శంకర్, జువ్వి యాదయ్య కరుణాకర్ అశోక్, సుర్కంటి బక్కయ్య,బొమ్మ కంటి సుందరయ్య ఎర్నాo వెంకటేష్, జువ్వి దేవాతదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై చిర్రగోని శంకర్ యాదవ్, బొమ్మ కంటి నరేష్, కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి రావుల స్వామి ఆహ్వానించారు.