సమ్మక్క కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

The Congress party stands by the Sammakka family– పాలడుగు వెంకట కృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు 
నవతెలంగాణ – గోవిందరావుపేట 
ఇటీవల మరణించిన మృతురాలు సమ్మక్క కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని కర్లపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గాంధర్ల సమ్మక్క కుటుంబాన్ని పరామర్శించి రూ.3000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ సమ్మక్క కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా తోడుగా ఉండి ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తండా కృష్ణ, జాడి హనుమయ్య, గాంధర్ల బాబు, దుర్గం సమ్మయ్య, వాసం బాబు, గాంధర్ల చందర్ రావు తదితర నాయకులు పాల్గొన్నారు.