మండలంలోని కర్లపల్లి గ్రామానికి చెందిన పెండేకట్ల బాలరాజు నానమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాలడు వెంకటకృష్ణ పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ బాలరాజు నానమ్మ సమ్మక్క మృతి బాధాకరమని అన్నారు. కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, జిల్లా అధికార ప్రతినిధి జెట్టి సోమయ్య, మండల ప్రధాన కార్యదర్శి తేళ్ల హరిప్రసాద్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, ఈక జగ్గారావు, తుమ్మల శివ, రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.