సాగునీరుతో నియోజకవర్గం సస్యశ్యామలం ..

Constituency is green with irrigation..– గత బిఆర్ఎస్ పాలనలో పేద కుటుంబాలు నిర్లక్ష్యం 

– యేమాల ఎలేందర్ రెడ్డి
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సాగునీరుతో నియోజకవర్గంలో ప్రతి పల్లెకు నీళ్లు అందించి సస్యశ్యామలం చేశారని పిఎసిఎస్ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ యాదగిరిగుట్ట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యేమాల ఎలేందర్ రెడ్డి అన్నారు. బుధవారం, యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, ఆయన మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పేరుతో, అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇవ్వక 10 సంవత్సరాలు కాలయాపన చేసిందని అన్నారు. గత 10 సంవత్సరాల గత బిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో పేద కుటుంబాలు సొంత ఇంటి కల నెరవేరక, రేషన్ కార్డులు రాక నిర్లక్ష్యానికి గురి అయ్యాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు అందజేస్తుందని అన్నారు. మహాలక్ష్మి తో 500 కి గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు మహిళా సాధికారత వైపుకు నడిపిస్తున్నాయని అన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్ట కొండ చుట్టూ రింగ్ రోడ్డు ఎత్తు పెంచి నిర్మించడంతో స్థానికులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. భక్తులు కొండపైన నిద్ర చేసే వారి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం డార్మెటరీ హాల్ సౌకర్యం కల్పించిందని, భక్తుల కోసం కొండపైన కొబ్బరికాయలు కొట్టు స్థలాన్ని ఏర్పాటు చేసిందని, కొండపైన భక్తుల కోసం పాతగుండంను పునరుద్ధరించిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం రుణమాఫీ చేసిందని, అర్హులైన ప్రతి రైతుకు రైతుభరోసా అందిస్తామని అన్నారు.