
– ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు చెయ్యాలి.
– డిసెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొనండి..
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు పిలుపు.
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు పిలుపు.
నవతెలంగాణ- భువనగిరి : 76 ఏళ్ల స్వాతంత్ర భారత దేశంలో నేటికీ దళితులు అంటరానితనం, కులవివక్ష, దాడులు, హత్యలు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారని కేంద్రంలో పరిపాలన చేస్తున్న మతోన్మాద, మనువాద బీజేపీ ప్రభుత్వం నేటికి దళితులను భూమికి, విద్యకు, వైద్యానికి, సంపదకు దూరం చేస్తున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు విమర్శించారు. శనివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో దళిత సమ్మిట్ లో భాగంగా ఏ.ఐ.ఏ.డబ్ల్యూ.యు, పి.ఎం.సి, కెవిపిఎస్, డి.బి.ఎస్.యు, బి.కేఎం.యు, డి.హెచ్.పి.ఎస్ సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగం, రిజర్వేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, దళితులపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు , హత్యలు అరికట్టి, దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్లల సాధన కోసం ” రౌండ్ టేబుల్ సమావేశం” నిర్వహించగా ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వెంకట్రాములు పాల్గొని మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కులవివక్షతను పెంచుకోచేస్తూ ప్రభుత్వ రంగ సమస్యలను ప్రవేటుపరం చేస్తూ విద్యా, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం లేదని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రైవేటు రంగాన్ని అమలు చేస్తూ ఆ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. దేశంలో, రాష్ట్రంలో వేలాది ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కాలీ ఉన్న ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర లక్షల కుటుంబాలకు సెంట్ భూమి లేదని చెప్పిన ఈ ప్రభుత్వం కేవలము 6000 కుటుంబాలకు పనికిరాని భూమిని పంపిణీ చేసి చేతులు దులుపుకున్నదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సబ్ ప్లాన్ చట్టం ఉన్న దాన్ని అమలు చేయడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్ రంగాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. భారత రాజ్యాంగంలో దళితులకు, గిరిజనులకు అనేక హక్కులు, చట్టాలు కల్పించారని వాటిని లేకుండా చేయడానికి భారత రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర బీజేపీ చేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులోత్తుతు కెసిఆర్ ప్రభుత్వం అదేవిధంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా దళితుల పై జరుగుతున్న దాడులను, కులవివక్షతను అరికట్టవలసిన అవసరం ఉందని, రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య గారి జీవోలను అమలు చేసి భూమిలేని ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ప్రభుత్వ భూములను పంచాలని వారు డిమాండ్ చేశారు. డి.బి.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ దేశంలో దళితుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, కులాంతర వివాహాలు చేసుకుంటున్నా జంటలకు రక్షణ కల్పించడానికి ప్రత్యేకమైన చట్టం సుకురావాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం డిసెంబర్ 4న నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమంలో వేలాదిగా దళితులు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షత వహించగా ఈ కార్యక్రమంలో పి ఎం సి రాష్ట్ర కార్యదర్శి సురుపంగ శివలింగం, బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ, తెలంగాణ దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు పల్లెర్ల వెంకటేశం, బి. కే.ఎం. యు జిల్లా అధ్యక్షులు ముత్యాలు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి సందెల రాజేష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, డి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు దయాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సల్లూరి కుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు సిర్పంగి స్వామి, కూకుట్ల చొక్కాకుమారి, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ బాలయ్య, కొండాపురం యాదగిరి, సిలివేరి ఎల్లయ్య, బొల్లెపల్లి కిషన్, కలుకూరి రామచందర్, ఎర్ర ఊషయ్య, బండారి శ్రీరాములు ప్రజా సంఘాల నాయకులు నేరడ స్వామి, ఎర్రోళ్ల లింగస్వామి పాల్గొన్నారు.