
– కాంట్రాక్టు ఏఎన్ఎంల రాత పరీక్షలను రద్దు చేయకుంటే మరో పోరాటానికి సిద్ధమవుతాం
– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్
నవతెలంగాణ – కంఠేశ్వర్
కాంట్రాక్టు ఏఎన్ఎం ఎం పి హెచ్ ఎస్ ఎఫ్ లకు రాత పరీక్ష లేకుండా రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్టు ఏఎన్ఎంల రాత పరీక్ష రద్దు చేయకుంటే మరో పోరాటానికి సిద్ధమవుతామని సి ఐ టి యు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సిఐటియు ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎం లందరినీ రెగ్యులర్ చేయాలని రాస్తారోకో నిరసన కార్యక్రమానికి పోలీసు యంత్రాంగం నిర్బంధాలు ఆటంకాలు పెట్టిన ధర్నా చౌక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..వైద్య ఆరోగ్య శాఖలో 2000సం|| నుండి నేటి వరకు కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న ఎ.ఎన్.ఎమ్.లు రెగ్యులరైజెషన్, కనీస వేతనాలు, ఇతర చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని దశాబ్దాల తరబడి దశలవారి ఆందోళన,పోరాటాలు, నిరవధిక సమ్మెలు చేస్తున్నారు. సమ్మెల సందర్భంగా ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. గతంలో సమ్మె సందర్భంగా ఎఎన్ఎమ్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తేది 02.09.2023 రోజున మోమో నెం. 7716/జి/2023-1 ద్వారా ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటి ఎ.ఎన్. ఎమ్.లతో సమావేశం జరిపి వారి సమస్యల పరిష్కారం కోసం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని మోమోలో పెర్కొన్నారు. కానీ ఈ కమిటి ఇప్పటి వరకు సమావేశం కాలేదు. పైగా ఈ కమీటి రిపోర్టు లేకుండానే 2024 డిసెంబర్ 29వ తేదిన రాత పరీక్ష ఉంటుందని ప్రకటించడం వలన ఎఎన్ఎమ్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ త్రిసభ్య కమిటీని ఎ.ఎన్.ఎమ్.లతో సమావేశ పరిచి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఎఎన్ఎమ్లకు రాత పరీక్ష లేకుండ రెగ్యులర్ చేయాలి. సర్వీసు వెయిటెజి 50 మార్కులు ఇవ్వాలి. వయోపరిమితిని ఎత్తి వేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.ఎక్స్రేషియ, ఆరోగ్య భీమ సౌకర్యం కల్పించాలి.జనాభా ప్రతిపదికన సబ్ సెంటర్లను పెంచాలి. డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం జిల్లా నాయకురాలు ప్రమీల, గంగా, జమున, సావిత్రి, విజయలక్ష్మి, సావిత్రి, సరోజ, సుమలత, పద్మ, సంతోషి, సరోజ, తదితరులు పాల్గొన్నారు.