సివరేజ్‌ పైప్‌లైన్‌ పనులను పరిశీలించిన కార్పొరేటర్‌

నవతెలంగాణ – బంజారాహిల్స్‌
ఖైరతాబాద్‌ డివిజన్‌లో స్థానికుల విజ్ఞప్తి మేరకు మారు తి నగర్‌లో జరుగుతున్నటువంటి నూతన సివరేజ్‌ పైప్‌ లైన్‌ పనులను వాటర్‌ వర్క్స్‌ మేనేజర్‌ నదీంతో కలిసి బుధవారం కార్పొరేటర్‌ పి. విజయ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మెయిన్‌ లైను 30 శాతం వరకు 10” ఇంచులు వేసి మిగతా 30 శాతం 8” ఇంచుల పైపు వేస్తున్నారని దానితో పనులను ఆపివేయడం జరిగిందని, మిగతా 40శాతం మెయిన్‌ లైన్‌ పూర్తిగా పది ఇంచులు వెయ్యాలని స్థానికులు పి విజయ రెడ్డిని కోరారు. దాంతో వెంటనే వాటర్‌ వర్క్స్‌ సీజీఎం, జీఎంతో కార్పొరేటర్‌ మాట్లాడి బ్యాలెన్స్‌ పనులకు వెంటనే అమలు చేసి మెయిన్‌ లైన్‌ పది ఇంచుల పనులు మారుతి నగర్‌లో పూర్తిగా వెయ్యాల న్నారు. సానుకూలంగా స్పందించిన అధికారులు 15 రోజులలో అమలు చేసి పనులను మొదలుపెడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, స్థానిక బస్తీ వాసులతో పాటు పలువురు మహిళలు పాల్గొ న్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షినీ గాంధీభవన్‌లో కార్పొరేటర్‌ మర్యాద పూర్వకంగా కలిశారు.