
– 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేద్దాం
– తెలంగాణ బీడీ,సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ)
నవతెలంగాణ – కంటేశ్వర్
బీడీ పరిశ్రమను ధ్వంసం చేసే కోస్ట చట్టం 2023 సవరణను ఉపసంహరించుకోవాలని, కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక విధానాలను ప్రతిగటిద్దామని, 2024 ఫిబ్రవరి 16 దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేద్దామని తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారంతెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ధోరణి తెలంగాణ బీడీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కి హెడ్ ఆఫీస్ నిజామాబాద్ లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు కె గోపాలస్వామి ఎస్ వి రమ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నూర్జహాన్ లు మాట్లాడుతూ.. కేంద్రం బీజేపీ ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ సామాన్య ప్రజల హక్కులపై దాడి చేస్తున్నది. దేశానికి ఆర్ధిక వనరులను సమకూర్చే ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్ముతున్నది. కార్మికవర్గం అనేక పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా మార్చింది. సంఘం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కులను రద్దు చేసింది. లాకౌట్లు, లే-ఆఫ్లు, వేతనాల తగ్గింపు, కార్మికుల తొలగింపులు, కార్మికుల ఉపాధి యజమానుల ఇష్టంపై ఆధారపడే దుర్మార్గపు విధానాలను లేబర్ కోడ్లలో పెట్టారు. అంతేకాదు బీడీ వెల్ఫేర్ యాక్ట్ రద్దు చేసి కార్మికుల సంక్షేమం కోసం 1 శాతం నిధులు లేకుండా చేసింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కోస్టా చట్టం-20230 సవరణలు తెచ్చి బీడీ పరిశ్రమపై అనేక ఆంక్షలు పెట్టింది. బీజేపీ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని, 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని జాయింట్ ప్లాట్ఫాం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగ సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్లు మరియు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో బీడీ కార్మికులంతా పాల్గొని, జయప్రదం చేయాలని తెలంగాణ బీడీ, సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలు, సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తున్నది. | వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థల్లో 100 శాతం వాటాలు తెగనమ్ముతున్నది. నేషనల్ మానిటైజేషన్ ఫైడ్లైన్ (ఎన్ఎంపి) పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో | ప్రైవేటీకరిస్తున్నది. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ | ఫండ్ సంస్థలకు కట్టబెడుతున్నది. సింగరేణిలోని 4 బొగ్గు గనులను వేలం వేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది. కార్మికులు, మధ్యతరగతి ప్రజల్లో అత్యధికులు పాలసీదార్లుగా వున్న ఎల్ఎసి వాటాలను అమ్మేందుకు తెగబడింది. కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలతో ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నది. ఈ విధానాలు ఉద్యోగుల భద్రతతో పాటు దేశ ఆర్ధిక స్వావలంబనకే ముప్పు తెస్తున్నాయి. అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చింది. కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికింది. సమ్మె హక్కును కాలరాస్తున్నది. పిఎఫ్, ఇఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తున్నది. తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తెస్తున్నది. కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెంచి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నది. కనీస వేతనం నెలకు రూ.26,000/-లు నిర్ణయించేందుకు బీజేపీ ప్రభుత్వం అంగీకరించటం లేదు. కోట్లాది మంది కార్మికులకు వర్తించే ఇపిఎస్ పెన్షన్ నెలకు రూ.10,000/-లకు పెంపు, సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ (ఓపిఎస్)ను పునరుద్ధరణను వ్యతిరేకిస్తున్నది. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు 8వ పే కమిషన్ను నియమించకుండా జాప్యం చేస్తున్నది. భారతర రాజ్యాంగాన్ని అందులో పొందుపరిచిన లౌకికవాదాన్ని తారుమారు చేస్తూ హిందూ రాజస్థాపన లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ తన ఎజెండను ముందుకు తీసుకెళుతుంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదరికం, ఆకలి, మొదలైన కీలక అంశాలను ప్రజల దృష్టి నుండి మలచడానికి ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోనే మతతత్వ శక్తులు ఇప్పుడు రామాలయ ప్రారంభోత్సవం, అక్షింతలు పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చాయి. ఈ కార్యక్రమాన్ని ఒక మతం వారు జరుపుకునే కార్యక్రమం కాకుండా ఇతరుల మనోభావాలను దెబ్బతీస్తున్నది. రాజ్యాంగానికి లౌకిక విలువలకు తిలోదకాలిస్తూ మొత్తం ప్రభుత్వ కార్యక్రమంగా మోడీ భజనగా మార్చివేశారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నా మూడోసారి కూడా అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు విమానం చేస్తున్నది. అందుకే కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యక్తికి తెచ్చి కోప్టా చట్టం 2023న ఉపసంహరించుకోవాలి. బీడీ వెల్ఫేర్ సేస్సు యాక్ట్ ను పునరుద్ధరించాలని, కనీస పెన్షన్ ఇవ్వాలని 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె గ్రామీణ బంద్ లో బీడీ కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.