
మండలంలోని చౌట్ పల్లి గ్రామ శివారులోని శ్రీ కోటిలింగేశ్వర స్వామిని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శాసనసభ ఎన్నికలకు ముందు శ్రీ పత్యంగిరా మాత త్రిశూలమునకు కట్టిన ముడుపులు విప్పి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ ప్రత్యంగిరా మహా యాగం, పూర్ణహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి దంపతులకు ఆలయ నిర్మాణ ధర్మకర్తలు గంగా ప్రసాద్ దీక్షితులు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు.