రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో, జిల్లాలో 2014 జూన్ 2 నుండి జరిగిన రైతు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 194 జిఓ ప్రకారంగా రూ. 6 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం, 2014 నుండి 2021 వరకు దాదాపుగా రాష్ట్రంలోనే 7వేలమంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, ఆదిలాబాద్ జిల్లాలో 302 మంది,రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. 194 జిఓ ప్రకారంగా ఈ కుటుంబాలకు మాత్రమే నష్టపరిహారం అందించిందని పేర్కొన్నారు. నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ, రైతు స్వరాజ్య వేదిక, తరఫున 2021లో హైకోర్టులో ఫిల్ వేయడం జరిగింని 2023లో రైతు ఆత్మహత్య చేసుకున్న అర్హులైన , కుటుంబాలకు నాలుగు నెలలలోపు 6 లక్షల రూ, నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ తీర్పులో భాగంగానే, రాష్ట్రంలో 141,రైతు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు జిఓ నంబర్ 15 ప్రకారంగా రూ.9,98,50,008ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు.