కార్మికవర్గ పురిటిగడ్డ పటాన్‌చెరులో సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలి

In working class Puritigadda Patancheru CPI(M) candidate should win– ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
– మల్లికార్జున్‌కు బీఫామ్‌ అందజేత
నవతెలంగాణ-పటాన్‌ చెరు
కార్మికవర్గ పోరాటాల పురటి గడ్డ పటాన్‌చెరు నియోజకవర్గంలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన జొన్నలగడ్డ మల్లికార్జున్‌ను ప్రజలు ఆదరించి గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు విజ్ఞప్తి చేశారు. మండలంలోని ఇస్నాపుర్‌లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బీరం మల్లేశం అధ్యక్షతన సీపీఐ(ఎం) పటాన్‌ చెరు నియోజకవర్గ వర్క్‌షాప్‌ను సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి చుక్క రాములు ముఖ్యఅతిథిగా హాజరై.. మల్లికార్జున్‌కి బీ-ఫామ్‌ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న సీపీఐ(ఎం)ను ప్రజలు, కార్మికులు గెలిపించాలని కోరారు. ప్రజా ఉద్యమాలను, ప్రజల గొంతుకను శాసనసభలలో వినిపించేందుకు మల్లికార్జున్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు. ప్రజలు, కార్మిక, రైతులు, మహిళలు, విద్యార్థుల సమస్యల మీద అనేక పోరాటాలు చేసిన అనుభవం కలిగిన వ్యక్తిగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారమే తన ఎజెండాగా పోరాటం చేస్తున్న మల్లిఖార్జున్‌ను ప్రజలు ఆదరించాలన్నారు.పేదల భూములు కాపాడాలని, కాలుష్యాన్ని అరికట్టడంలో, మెట్రో రైలు కోసం, నియోజకవర్గ సమగ్ర అభివద్ధి సాధనకై అనేక పోరాటాలు నిర్వహించిన సీపీఐ(ఎం)కు మాత్రమే ఓటు అడిగే న్కెతిక హక్కు ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి జయరాజు, మెదక్‌ జిల్లా కార్యదర్శి ఏ మల్లేష్‌, సీనియర్‌ నాయకులు వాజిద్‌ అలీ, నరసింహారెడ్డి, పాండురంగారెడ్డి, రామచందర్‌, రాజయ్య, నాగేశ్వరరావు, వివిధ పరిశ్రమల కార్మిక నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.